Atmakur: విద్యార్థిని అనుమానాస్పద మృతి - కేజీబీవీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్

Atmakur: కొత్తపల్లి కేజీబీవీ విద్యార్థిని భవ్య మృతి ఘటనలో వేటు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్ కృష్ణబాయిని సస్పెండ్ చేసిన అధికారులు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 26 Sept 2026 8:46 PM IST
Atmakur
X

Atmakur: విద్యార్థిని అనుమానాస్పద మృతి - కేజీబీవీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్

ఆత్మకూరు: ఆత్మకూరు( నంద్యాల జిల్లా ) నిరుపేద వర్గాల విద్యార్థినీలకు విద్యుతో ఉజ్వల భవిష్యత్తు కలిగించి వారి విద్యా సంక్షేమాన్ని చూసుకోవాల్సిన ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహించి విద్యార్థిని అనుమానాస్పద మృతికి కారణమైంది.

దీంతో ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల్లో కఠినంగా వ్యవహరించి ప్రిన్సిపాల్ విధుల నుంచి పూర్తిగా తప్పిస్తూ వేటి వేసిన సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

కొత్తపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ వరకు 350 మంది విద్యార్థులు ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ విద్యాలయంలో ప్రిన్సిపల్ కృష్ణ బాయి, ఇతర సిబ్బంది విద్యార్థినిలను వేధిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వక వేధిస్తున్నారు.

ఇంతటితో ఊరుకున్నారా అంటే.. విద్యార్థినిలను మానసికంగా వేధించి, సీనియర్ల ర్యాగింగ్, వికృత చేష్టలను నియంత్రించక పోవడమే కాక విద్యార్థినిల తల్లిదండ్రులను కూడా దుర్భాషలాడారు.

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న భవ్య అనే విద్యార్థిని బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

విషయాన్ని గొప్పగా ఉంచిన ప్రిన్సిపాల్ కృష్ణ భాయి, సాహ సిబ్బంది విద్యార్థిని భవ్య ఆత్మహత్య చేసుకున్నట్లు నకిలీ రాత వాంగ్మూలాన్ని సృష్టించారు. ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు, విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిన కీలక శాఖ అధికారులు అందరూ కలిసి మరణించిన విద్యార్థిని భవ్య రాసినట్లు ఆత్మహత్య ఉత్తరాన్ని సృష్టించి తనకు తానే ద్రావణం తాగినట్లు అందర్నీ నమ్మించారు.

విద్యార్థిని చనిపోయినట్లు తల్లిదండ్రులకు కూడా తెలపకుండా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కానించి ఆ తర్వాత విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు.

ఈ సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యాలయం విద్యార్థుల తల్లిదండ్రులు నంద్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కొత్తపల్లి కస్తూరిబా విద్యాలయం ప్రిన్సిపల్ కృష్ణబాయిపై వేటపడింది.

ప్రజల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు విద్యాలయానికి మిత్రులందరికీ ఈ సంఘటనతో ప్రిన్సిపల్ పై మొదటి వేటు పడింది. మరి కొంతమంది సిబ్బందిపై కూడా అవకాశాలు ఉన్నాయని సమాచారం.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)