Nandyal: నంద్యాలలో గ్యాస్ సిలిండర్ల పంపిణీపై జేసీ సమీక్షా సమావేశం!
Nandyal: నంద్యాలలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ, వినియోగదారులకు అందుతున్న సేవలపై జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Nandyal: నంద్యాలలో గ్యాస్ సిలిండర్ల పంపిణీపై జేసీ సమీక్షా సమావేశం!
Nandyal: నంద్యాల జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ, వినియోగదారులకు అందుతున్న సేవలపై జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సివిల్ సప్లైస్ అధికారి రవిబాబు, గ్యాస్ ఏజెన్సీ, డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సకాలంలో, నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని అన్నారు. గ్యాస్ సరఫరా, డెలివరీలో జాప్యం కారణంగా వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఏజెన్సీ డీలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వినియోగదారుల నుంచి నిర్వహించే ఐవిఆర్ఎస్ కాల్స్‌లో ఎటువంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రాకుండా గ్యాస్ ఏజెన్సీలు నాణ్యమైన సేవలు అందించాలన్నారు.
వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఏజెన్సీ యాజమాన్యాలు పర్యవేక్షణ చేసుకోవాలని అన్నారు. గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సిబ్బంది డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించడంతో పాటు, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, సిబ్బంది వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.




