Nandikotkur: నందికొట్కూరులో కొరియర్ ఆఫీసులపై ఎక్సైజ్ మెరుపు దాడులు!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు కొరియర్, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Nandikotkur: నందికొట్కూరులో కొరియర్ ఆఫీసులపై ఎక్సైజ్ మెరుపు దాడులు!
నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సాధు రవికుమార్ ఆదేశాల మేరకు, నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. రామాంజనేయులు ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని పలు ట్రాన్స్‌పోర్ట్ మరియు కొరియర్ కార్యాలయాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు భాష్యం శ్రీనివాసులు, హరిత మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎస్. రామాంజనేయులు మాట్లాడుతూ — స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి ట్రాన్స్‌పోర్ట్, కొరియర్ ఏజెన్సీల ద్వారా అక్రమంగా మద్యం, గంజాయి, డబ్బు లేదా ఇతర నిషేధిత వస్తువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులు పార్సిళ్లను బుక్ చేసుకునే సమయంలో పంపేవారి, స్వీకరించేవారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు కాపీలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద పార్సిల్ గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులుకు కానీ, ఎక్సైజ్ అధికారులకు కాని సమాచారం అందించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులతో పాటు రవాణా సంస్థలపై కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




