Jupadubangla: మండ్లెం రోడ్డుపై వరి నారు నాటి సీపీఐ నేత రమేష్ బాబు నిరసన

Jupadubangla: నంద్యాల జిల్లా మండ్లెం రోడ్డుపై చెరువును తలపిస్తున్న నీటిలో వరి నారు నాటి సీపీఐ నిరసన. అధికారుల తీరుపై మండిపడ్డ సీపీఐ నేత రమేష్ బాబు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 24 Sept 2026 11:01 PM IST
Jupadubangla
X

Jupadubangla: మండ్లెం రోడ్డుపై వరి నారు నాటి సీపీఐ నేత రమేష్ బాబు నిరసన

జూపాడుబంగ్లా: జూపాడు బంగ్లా మండలం లోని మoడ్లెం గ్రామంలో కేజీ రహదారి నడిబొడ్డున రోడ్డు జలమయంతో నిండిపోయి చరువును తలపిస్తుందని వాహనదారులకు ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారని పరిష్కరించాల్సిన అధికారులు అటువైపు చూసిన పరిస్థితి లేదని తక్షణమే సమస్య పరిష్కరించాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు హెచ్చరించారు.

వర్షం నీటితో చెరువును తలపిస్తున్న రోడ్డును పరిశీలించి వరి నారు నాటి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నందికొట్కూరు ఆత్మకూరుకు ప్రధాన రహదారిలో మoడ్లెం గ్రామం రోడ్డు నడివీధిలో చెరువును తలపించేలాగా నీరు నిలవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.

అన్ని గ్రామాల్లో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేస్తున్నారు తప్ప మండ్లం గ్రామంలో ఎందుకు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల నుండి ఇదే రహదారి వర్షపు నీటితో ఉండడంతో బురద చేరి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు అన్నారు.

తక్షణమే నీటిని పక్కకు తొలగించేందుకు కాలువను తవ్వి మెయిన్ రోడ్డు పై నీరు లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయంపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజు గ్రామ వీధి ప్రజలు పాల్గొన్నారు..

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)