Nandyal: నంద్యాలలో గుండెపోటుతో బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు మృతి!
Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలీలో విషాదం. గుండెపోటుతో బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు పూజారి శివ కేశవ (29) మృతి. కుటుంబంలో తీవ్ర విషాదం.
Nandyal: నంద్యాలలో గుండెపోటుతో బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు మృతి!
Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలీ మండలానికి చెందిన BJP యువమోర్చా మండల అధ్యక్షుడు పూజారి శివ కేశవ (29) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి సుమారు 9 గంటలకు జ్వరం రావడంతో ప్యాపిలీ పట్టణంలోని RMP వైద్యుడు వద్ద చికిత్స పొందారు. వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం వాంతి వస్తోందని చెప్పి బాత్రూంలోకి వెళ్లగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయినట్లు సమాచారం.
వెంటనే కుటుంబ సభ్యులు కారులో కర్నూలులోని అమీలియో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. శివ కేశవ మృతితో ప్యాపిలీలో విషాదం నెలకొంది.




