Nandikotkur: డేట్, టైమ్ మీరే చెప్పండి.. బహిరంగ చర్చకు సిద్ధం: నందికొట్కూరు టీడీపీ
Nandikotkur: నందికొట్కూరులో అభివృద్ధిపై బహిరంగ చర్చకు డేట్, టైమ్ మీరే చెప్పాలంటూ వైఎస్సార్సీపీ నేత ధారా సుధీర్‌కు టీడీపీ శ్రేణులు ప్రతి సవాల్ విసిరాయి.
Nandikotkur: డేట్, టైమ్ మీరే చెప్పండి.. బహిరంగ చర్చకు సిద్ధం: నందికొట్కూరు టీడీపీ
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మరియు క్లస్టర్ ఇంచార్జి లాయర్ జాకీర్ మాట్లాడుతూ నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి సంబంధించిన పార్టీ నాయకులను ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడడం చూస్తే ఆయన వైఖరి ఏంటో అర్థం అవుతుంది.
ఫ్యాక్షన్ కు ఫీవర్ తెప్పించే నాయకుడు తన వెనుక వున్నాడంటూ చెప్పడం చూస్తే మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్నట్లుగా ఉంది.మా నాయకులు మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య లు కేవలం అభివృద్ధి పైనే దృష్టి ఉంచి ఫ్యాక్షన్కు దూరంగా ఉన్నారన్నారు.
నందికొట్కూరు పట్టణంలోని ప్రతి వార్డులో గమనిస్తే అభివృద్ధి కనిపిస్తుందని,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం మరియు మా నాయకులు పనిచేస్తున్నారని అన్నారు.
2019 నుంచి 2024 వరకు మీరు భూమిపూజ చేసి వెళ్లారే తప్ప,ఆ పనులను పూర్తి చేసిన దాఖలాలు లేవు.మీకు అభివృద్ధిని చూపించడానికి మా వద్ద ఉన్న ఆధారాలను మీకు తెలియజేయడానికి పోస్ట్ ద్వారా పంపుతామని చెప్పారు.
నందికొట్కూరు సహకార సంఘం సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ధారా సుధీర్ మైనారిటీలను తమ వైపుకు
తిప్పుకోవడానికి షాది ఖానా ప్రస్తావన తెస్తున్నారన్నారు. నందికొట్కూరులో అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం.టైమ్ మరియు డేట్, ప్రదేశం మీరు చెప్పినా సరే, మమల్ని చెప్పమన్నా సరే మేము సిద్ధం.
నాన్ లోకల్ అంటే హైదరాబాద్ లో ఉండే మీరే నిర్ణయించుకోవాలి,మేము ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నాం, అంటూ ఘాటుగా ధారా సుధీర్ కు ప్రతి సవాల్ విసిరారు.
ఫ్యాక్షన్కు ఫీవర్ తెప్పించే నాయకుడు మీ వెనకాల ఉంటే,మేము తలుచుకుంటే మలేరియా మరియు డెంగ్యూ కచ్చితంగా మీకు వస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మరియు క్లస్టర్ ఇంచార్జి లాయర్ జాకీర్,సహకార సంఘం సొసైటీ చైర్మన్ మూర్తుజావలి, పగిడాల మండలం టిడిపి మండల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు జమీల్,పాణ్యం వేణుగోపాల్ పాల్గొన్నారు.




