Nandikotkur: రూ.21 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనుల ప్రారంభం

Nandikotkur: నందికొట్కూరులో రూ.21 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. స్థానిక అభివృద్ధిపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై ఫైర్.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 22 Sept 2026 5:48 PM IST
Nandikotkur
X

Nandikotkur: రూ.21 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనుల ప్రారంభం

నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కుప్పం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు.

నందికొట్కూరు పట్టణం మిడ్తూరు రోడ్డులోని ప్యారడైస్ ఫంక్షన్ హాల్ నందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలో చేపట్టనున్న రూ.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక వసతుల బలోపేతం, ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పన లక్ష్యంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులతో నందికొట్కూరు మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగనుంది అన్నారు. వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు.

నందికొట్కూరు లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుంటే వైసీపీ నేతల కళ్ళకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. నేను లోకల్ నాకు నియోజకవర్గం లోని ప్రతి వ్యక్తి తెలుసు. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ సామాన్య ప్రజలతో కలిసి తిరుగుతా.. వారి తోనే కలిసి తింటా.. నేను ఇక్కడే పుట్టిన.. ఇక్కడే పెరిగిన.. నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వలస రాలేదు.. కానీ వైసీపీ కి చెందిన ఒక కొత్త వ్యక్తి ఇక్కడికి వలస వచ్చి టీడీపీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నక్కను చూసి కుక్కలు వాతలు పెట్టుకున్నట్లు ఉంది వైసీపీ నాయకుల తీరు అని పేర్కొన్నారు. చిన్న పిల్లలను అడ్డుపెట్టుకొని డంప్ యార్డ్ రాజకీయం చేస్తున్నారు. ఒక వైద్యునికి పిల్లల ఆరోగ్యం పట్టదా మీ స్వార్థం కోసం పిల్లల ఆరోగ్యాన్ని నాశనము చేస్తారా అని వైసీపీ నేతల పై విరుచుకు పడ్డారు. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ మూకలు నందికొట్కూరు నియోజకవర్గం లో అల్లర్లు స్టష్టించడానికి కుట్రలు పడుతున్నారని ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అని మీ ఆటలు సాగవు అని వైసీపీ నాయకులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మూర్తి జావలి, లాయర్ జాకీర్ హుస్సేన్, పల్చన్ మహేశ్వర్ రెడ్డి, మరియు నందికొట్కూరు పట్టణ నాయకులు ప్రజలు మున్సిపాలిటీ అధికారులు పాల్గొనడం జరిగింది.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)