Nandikotkur: నందికొట్కూరులో ఫ్యాన్ దూకుడు: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రచారం!

Nandikotkur: నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 28, 31 వార్డుల్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 22 Oct 2026 6:41 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరులో ఫ్యాన్ దూకుడు: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రచారం!

నందికొట్కూరు: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సందిగ్ధత నెలకొన్న వేళ, నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పురపాలక పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ యువ నాయకత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది.

రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పట్టణంలోని 28వ వార్డు, 31వ వార్డు లలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి సందు, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలిశారు.

ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ... "నందికొట్కూరు అభివృద్ధి మా బాధ్యత. గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు, అమ్మఒడి, చేయూత వంటి 100కి పైగా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వచ్చాయి. అదే సంక్షేమ పాలనను మున్సిపాలిటీలో కూడా కొనసాగిస్తాం" అని ప్రజలకు వివరించారు.

ప్రతి ఇంట్లో తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండటం వంటి మౌలిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ ఫాతిమా బీని

28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తెలుగు సుజాతను. 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఖాసిం వలిని, ఈ ముగ్గురిని ఫ్యాన్ గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

నందికొట్కూరు మున్సిపాలిటీ బైరెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉంది. TDP కూటమి (సైకిల్ గుర్తు) కూడా అదే వార్డుల్లో గట్టిగా ప్రచారం చేస్తుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారింది.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు, వార్డు ఇంచార్జులు, మహిళా విభాగం నాయకురాళ్లు, యువజన విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)