Nandikotkur: నందికొట్కూరు వైసీపీ ప్రచారంలో బైరెడ్డి సిద్ధార్థ్!
Nandikotkur: నందికొట్కూరు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు షేక్ ఫాతిమా బీ, ప్రమీలమ్మ తరఫున బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Nandikotkur: నందికొట్కూరు వైసీపీ ప్రచారంలో బైరెడ్డి సిద్ధార్థ్!
Nandikotkur: నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ ఫాతిమా బీకి, 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి కాపులపల్లి ప్రమీలమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.
గత వైసిపి ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.
నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాపులపల్లి ప్రమీలమ్మ కుమారుడు మోహన్ రెడ్డి స్థానిక వార్డులోని యువతతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం,పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాలుపంచుకుండటంతో వైసీపీ ఖాతాలో ఈ వార్డు ఖచ్చితమని వార్డు ప్రజలు చెప్పుకుంటున్నారు.
ఈ ఎన్నికల ప్రచారంలో కాపులపల్లి మెుహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, సప్లయర్ సత్యనారాయణ,మైనారిటీ నాయకులు జబ్బార్, జాకీర్, వి.ఆర్. శ్రీను,పాణ్యం నాగరాజు, బుజ్జి, కొప్పుల రమణ, రాంబాబు, రాజేష్, చిలక ప్రసాద్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఇమ్రాన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




