Nandikotkur: నందికొట్కూరు ఎన్నికల్లో సంచలనం: వసంతకుమారికి మద్దతు

Nandikotkur: నందికొట్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వతంత్ర అభ్యర్థి ఆర్. వసంతకుమారికి తోగటవీర క్షత్రియ సేవా సమితి, చౌడేశ్వరి ఆలయ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 19 Oct 2026 7:09 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరు ఎన్నికల్లో సంచలనం: వసంతకుమారికి మద్దతు

నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార కూటమి, వైసీపీ అభ్యర్థుల హోరాహోరీ మధ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్.వసంతకుమారి (W/o కోరుముట్ల రవీంద్రబాబు) భారీ మద్దతు లభించింది.

పట్టణంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తోగటవీర క్షత్రియ సంఘం ఆమెకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

ఈ రోజు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *అఖిలభారత తోగటవీర క్షత్రియ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మరియు నందికొట్కూరు శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి చట్ట మురళి మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయనతో నందికొట్కూరు చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి ఆర్.వసంతకుమారీ మన ఆడబిడ్డ. ఆమె భర్త కోరుముట్ల రవీంద్రబాబు గారు పట్టణ అభివృద్ధి కోసం, ముఖ్యంగా మన చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. కులాలకు, పార్టీలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి మద్దతు ఇవ్వాలని మా కమిటీ నిర్ణయించింది."

అందుకే ఈ ఎన్నికల్లో నందికొట్కూరు తోగటవీర క్షత్రియ ఆలయ అభివృద్ధి కమిటీ తరపున, అఖిలభారత తోగటవీర క్షత్రియ సేవా సమితి తరపున మేమంతా ఏకగ్రీవంగా ఆర్.వసంతకుమారికి మా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము. మా సామాజిక వర్గం ఓటర్లందరూ, మా కుటుంబ సభ్యులందరూ ఆమెకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిస్తున్నాము అని ఆయన తెలిపారు.

ఎన్నికల్లో కీలక మలుపు

నందికొట్కూరు మున్సిపాలిటీలో తోగటవీర క్షత్రియ ఓటు బ్యాంకు నిర్ణయాత్మకంగా ఉండటంతో, వారి మద్దతు స్వతంత్ర అభ్యర్థి వసంతకుమారీ కు పెద్ద బలంగా మారనుంది. దీంతో చైర్ పర్సన్ పోటీలో త్రిముఖ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ కార్యక్రమంలోనందికొట్కూరు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వీరణాల ప్రసాద్,మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)