Nandikotkur: నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటింటి ప్రచారం
Nandikotkur: నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాల్గొని వైసీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
Nandikotkur: నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటింటి ప్రచారం
నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ ఫాతిమా బీకి, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి బి.సువర్ణమ్మకు. మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.
గత వైసిపి ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు.
నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బి.సువర్ణమ్మ భర్త బి.వెంకటేశ్వర్లు స్థానిక వార్డులోని ప్రతి కుటుంబంతో,ముఖ్యంగా యువతతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం,పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాలుపంచుకుండటంతో వైసీపీ ఖాతాలో ఈ వార్డు కూడా ఖచ్చితమని వార్డు ప్రజలు చెప్పుకుంటున్నారు.రెండవసారి కౌన్సిలర్ గా బరిలోకి దిగిన సువర్ణము గత అనుభవం పరిగణలోకి తీసుకుని ప్రచారంలో ప్రత్యర్థి అభ్యర్థుల కంటే ముందుండటం బాగా కలిసి వచ్చింది.
ఈ ఎన్నికల ప్రచారంలో బోయ వెంకటేశ్వర్లు, జి.ఎం ఖలీల్, జగన్ రఫీ, మధు,లింగస్వామి,పరశురాముడు,వడ్డే రాముడు,వడ్డే చెంచమ్మ,వడ్డే అరుణ, బోయ జంబులమ్మ,రమణమ్మ,సావిత్రి,లక్ష్మీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




