Markapur: ముత్రాసుపల్లిలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన

Markapur: మార్కాపురం/ప్రకాశం జిల్లా కొమరోలు పరిధిలోని ముత్రాసుపల్లిలో కొమరోలు ఎస్సై ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 10 Oct 2026 9:51 PM IST
Markapur
X

Markapur: ముత్రాసుపల్లిలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన

మార్కాపురం జిల్లా: కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్రాసుపల్లి గ్రామంలో కొమరోలు ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.

అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తూ, మహిళలు వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు. ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో పాటు పోలీసులకు సహకరించి గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు.

ఈ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, ఆస్తి పరిరక్షణ, ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్వహణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU