Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ కూటమి అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికకు ముస్లిం మత పెద్దల మద్దతు!
Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి మద్దతుతో బరిలోకి దిగిన సుభాన్ అన్న కోడలు డాక్టర్ షేక్ సాధికకు ముస్లిం మత పెద్దలు, కమ్యూనిటీ సోదరులు పూర్తి మద్దతు ప్రకటించారు.
Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ కూటమి అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికకు ముస్లిం మత పెద్దల మద్దతు!
Devanakonda: మండల స్థాయిలో తమ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించాలన్న ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరిందని ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. జుమా నమాజ్ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ, కూటమి నాయకులు దేవనకొండ జడ్పీటీసీ అభ్యర్థిగా సుభాన్ అన్న కోడలు డా. షేక్ సాధికను గుర్తించడం ఆనందంగా ఉందన్నారు.
డా. సాధికకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి భారీ మెజారిటీతో ఆమెను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ కమ్యూనిటీకి చెందిన డా. సాధికను జిల్లా పరిషత్‌కు పంపించేందుకు ముస్లిం సోదరులంతా ఐక్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ముస్లిం మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.




