Kodumuru: కోడుమూరులో జోరందుకున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు 2వ ఎంపీటీసీ స్థానానికి విద్యావంతుడైన యువకుడు మునీర్ బాషా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
Kodumuru: కోడుమూరులో జోరందుకున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో MPTC ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. నామినేషన్ల చివరి దశలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కోడుమూరు పట్టణంలోని 2వ MPTC స్థానానికి మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యావంతుడైన యువకుడు మునీర్ బాషా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన మునీర్ బాషా, కోడుమూరు గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో తనకు మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2వ MPTC స్థానానికి వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉండటంతో కోడుమూరులో ఎన్నికల సందడి నెలకొంది.




