Nandikotkuru: నందికొట్కూరులో హెచ్చిన 'సైకిల్' హోరు!
Nandikotkuru: నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల వేళ 18వ వార్డు లింగం వీధిలో మాండ్ర శివానందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు
Nandikotkuru: నందికొట్కూరులో హెచ్చిన 'సైకిల్' హోరు!
Nandikotkuru: నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పట్టణంలోని అత్యంత కీలకమైన 18వ వార్డు (లింగం వీధి) లో టీడీపీ సీనియర్ నాయకులు మాండ్ర శివానందరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ హవాను చాటారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ నందికొట్కూరు మున్సిపల్ కూటమి చైర్ పర్సన్ అభ్యర్థి శ్రీమతి మొల్ల సబేరున్నిసాకు 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ కొండారెడ్డి రజినీకుమార్ రెడ్డి,
సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వివరించారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాకే నందికొట్కూరుకు మళ్లీ అభివృద్ధి బాట పడుతుందని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 18వ వార్డు పట్టణ కూటమి నాయకులు లాయర్ జాకీర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, అక్బర్ బాషా, మెహబూబ్ బాషా, షాకీర్, దినకర్, సొసైటీ చైర్మన్ ముర్తుజావలి, బ్రహ్మం, ప్రసన్నా రెడ్డి, ప్రభుకుమార్, హుస్సేన్, కలాం, ప్రవీణ్, గని, నదీమ్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




