Aluru: మానేకుర్తి ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మిని గెలిపించండి!
Aluru: ఆలూరు మండలం మానేకుర్తి కూటమి ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి, రాజశేఖర్ ఎన్నికల ప్రచారం. మల్కాపేట రోడ్డు నిర్మాణంతో పాటు తాగునీరు, వైకుంఠ ధామం సమస్యల పరిష్కారానికి హామీ.
Aluru: మానేకుర్తి ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మిని గెలిపించండి!
Aluru: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మానేకుర్తి ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి,రాజాశేఖర్ మాట్లాడు తూ ఎంపీటీసీ అభ్యర్థి లక్ష్మి నీ గెలిపించ్చు కుంటే అన్ని గ్రామాలలొ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీలు పరిష్కరిస్తాం అలాగే ,అంగస్కల గ్రామంలో తాగునీటి సమస్యను బోర్ రిపేర్ ద్వారా పరిష్కరించామని, గోనెహల్ గ్రామంలో కూడా నీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.
అంగస్కల గ్రామంలో గత 10 నుంచి 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మసాన వాటిక నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల నిర్ణయం మేరకు అనువైన స్థలంలో మసాన వాటికను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మల్కాపేట గ్రామానికి సుమారు ఐదు కోట్ల రూపాయలతో రహదారి మంజూరైందని, ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయిన అనంతరం జనవరిలో రహదారి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కూటమి అభ్యర్థి శ్రీమతి లక్ష్మీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి క్షణం, ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.




