Kodumur: కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం!

Kodumur: కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ జయంతి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్. ఎన్నికల కోడ్ అమలు, పారదర్శకతపై అధికారుల దిశానిర్దేశం.

C. Ganesh, Kodumuru
Published on: 19 Oct 2026 2:28 PM IST
Kodumur
X

Kodumur: కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం!

Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ జయంతి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధికారులకు సహకరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని పేర్కొన్నారు.

ఈ సమావేశం ద్వారా ఎన్నికల కమిషనర్ నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు, ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు.ఈ కార్యక్రమంలో ఎమ్పీడీవో రాముడు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru