Giddalur: ప్రజల సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.
Giddalur: ప్రజల సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు,
కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ , పట్టణ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే గారికి తెలిపారు అందులో కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించగా, మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దూర ప్రాంతాల వారిని ఉద్దేశించి వారి వద్దకే అధికారులు వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నారని “ప్రజల వద్దకే పాలన” అనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో Grievance Redressal కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




