Kurnool: పత్తికొండలో 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత!
Kurnool: పత్తికొండ నియోజకవర్గంలో 26 మంది లబ్ధిదారులకు రూ.10.31 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అందజేశారు.
Kurnool: పత్తికొండలో 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత!
Kurnool: పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.10.31 లక్షల ఆర్థిక సాయం చెక్కులను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని తెలిపారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
నియోజకవర్గ ప్రజలు వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్కు అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




