Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలకు ఉచిత క్రీడా సామగ్రి అందజేత!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు మంత్రి నారా లోకేష్ మంజూరు చేసిన ఉచిత క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అందజేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Sept 2026 2:14 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలకు ఉచిత క్రీడా సామగ్రి అందజేత!

Kurnool: బి.క్యాంప్‌లోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, వారిని క్రీడల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందించిన ఉచిత క్రీడా సామగ్రి కళాశాలకు అందజేయడం జరిగింది.

కళాశాలకు చేరిన ఉచిత క్రీడా సామగ్రిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డా. ఎస్. నాగస్వామి నాయక్ మరియు స్టాఫ్‌కు అందజేశారు.

ఈ క్రీడా సామగ్రిలో క్రికెట్ బాల్స్, ఫుట్‌బాల్స్, వాలీబాల్స్, బ్యాడ్మింటన్ రాకెట్లు, షటిల్ కాక్‌లు, క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు తదితర క్రీడా సామగ్రి ఉన్నాయి. ఈ సామగ్రి విద్యార్థులకు క్రీడా సాధనలో ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

విద్యార్థుల జీవితంలో క్రీడలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం, ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.

కళాశాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ క్రీడా రంగంలో కూడా విద్యార్థులు ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తామని ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్ తెలిపారు. ప్రభుత్వం అందించిన క్రీడా సామగ్రిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వివిధ క్రీడల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు.

విద్యార్థులకు ఉచిత క్రీడా సామగ్రిని అందించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం విద్య, క్రీడలు మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డా. ఎస్. నాగస్వామి నాయక్, స్టాఫ్ మల్లికార్జున, విజయశేఖర్, ఉల్గోజి రావు, బాల శంకర్, నాన్-టీచింగ్ స్టాఫ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL