Nandikotkur: నందికొట్కూరు 13వ వార్డులో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇంటింటి ఎన్నికల ప్రచారం

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. 13వ వార్డులో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 21 Oct 2026 12:48 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరు 13వ వార్డులో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇంటింటి ఎన్నికల ప్రచారం

Nandikotkur: నందికొట్కూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 13వ వార్డులో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కూటమి బలపరిచిన నందికొట్కూరు పట్టణ మున్సిపల్ అభ్యర్థి శ్రీమతి మొల్ల సబేరున్నిసా ను 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీ మొల్ల జాకీర్ హుస్సేన్ ను తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి తమ అభ్యర్థులకు మద్దతు తెలపాలని స్థానిక ప్రజలను ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కూటమి నాయకులు, రబ్బాని, జాకీర్ హుస్సేన్, సొసైటీ చైర్మన్ మూర్తి జావలి, గని, బ్రహ్మం, ప్రసన్నా రెడ్డి, షేక్షావలి, అబ్దుల్లా, ప్రభుకుమార్, జమీల్, చిన్న రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)