Nandikotkur: మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే!
Nandikotkur: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఏబీఎం పాలెంలో వార్డు విజిట్ నిర్వహించి, సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య.
Nandikotkur: మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే!
Nandikotkur: నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఎబిఎం పాలెంలో వార్డు విజిట్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గిత్త జయసూర్య.
ఈ సందర్భంగా వార్డులోని రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక వసతులపై స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో మెరుగైన మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




