Anantapur: చిల్లర రాజకీయాలు మానుకోండి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫైర్!

Anantapur: కర్నూలులో స్థల వివాదంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, లోకల్ ఎన్నికల నేపథ్యంలో కొందరు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

Praveen, Regional Coordinator -Ananthapuram
Published on: 10 Oct 2026 1:51 PM IST
Anantapur
X

Anantapur: చిల్లర రాజకీయాలు మానుకోండి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫైర్!

Anantapur: స్థల వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి. మహిళకున్న స్థల వివాదం మంత్రి టీజీ భరత్ ద్వారా నా దృష్టికి తీసుకొచ్చారు. నేను కలెక్టర్ తో మాట్లాడి పరిష్కరించాలని కోరాం. ఆమె ఆగష్టు నెలలో ఒక వ్యక్తికి స్థలం విక్రయించారు. సెప్టెంబర్ 29కి ఆ స్థలం రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది. ఇది ఆలస్యం కావడంతో ఆమెను కొందరు మా పార్టీ వారిలో రెచ్చగొట్టారు.

ఆమెను కర్నూలు నుంచి అనంతపురం తీసుకొచ్చి మోటివేట్ చేశారు. ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇస్తే తొందరగా పని అవుతుందని ప్రోత్సహించారు. దీని వెనుక మా పార్టీ వారితో పాటు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ సమస్య పరిష్కారమైంది నిన్ననే ఆమెకు రిజిస్ట్రేషన్ చేయించారు.

మహిళతో మాట్లాడిన ఆడియోలో ఏముంది.. ఏమీ లేదు కదా. ఆమెకు పూర్తిగా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు ఇది గతంలో జరిగిన అంశం. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వారి ఇలాంటి పనులు చేస్తున్నారు. మా పార్టీలో ఉన్న వారే కొందరు కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు.

లోకల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటి కుట్రలు. దగ్గుపాటి అనే వ్యక్తిని ఏదో విధంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. గత రెండేళ్లుగా నా మీద బురద జల్లాలని అనేక దుష్ర్పచారాలు చేశారు. నేను చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇదంతా.

రాత్రి నిద్రలోకి కూడా నన్నే కలవరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అనంత రాజకీయ దురందరుడు. అలాంటి వారు కూడా నా మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా ఉనికి కోల్పోతున్నారు. సుధాకర్ యాదవ్ నాకు దగ్గరగా ఉన్నారని ఆయన్ని లాగారు.

నా పక్కన ఉన్న వాళ్లను పక్కకు లాగాలని చూస్తున్నారు. రుద్రంపేటలో ఎస్సీలకు మరికొందరికి స్థల వివాదం ఉంది. దాన్ని నాకు ఆపాదించి దుష్ర్పచారం చేశారు. అస్రా ఆసుపత్రి వివాదం వైసీపీకి చెందిన బీసీవ్యక్తి, మైనార్టీ మహిళకు సంబంధించింది. ఇందులో ఆసుపత్రికి తాళాలు వేస్తే నేను అరెస్ట్ చేయించా.

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి చెందిన వారు ఇందులో ఉన్నారు. అయినా సరే ఇందులోకి నన్ని లాగారు. మొన్న మీడియాను తీసుకొని వెళ్లి కొన్ని పార్టీలతో నామీద విమర్శలు చేయించారు. నేను భయపడేది లేదు.. నాకు అండగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నారు. నేను ప్రజలకు, మా అధిష్టానానికి బాధ్యతగా ఉంటాను.

ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోండి.. లేకుండా ఇంకా పతనం అవుతారు. మున్సిపల్ ఎన్నికల్లో 62కి 62స్థానాలు గెలవబోతున్నాం. రిజర్వేషన్ ఆధారంగా మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తారు.

మూడు నాలుగు రోజుల్లో అన్నింటిపై స్పష్టత వస్తుంది. పార్టీ పరంగా మేయర్ ఎవరికిచ్చినా.. మేము పని చేస్తాం. ఒక సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.పార్టీ సామాన్య కార్యకర్తకు ఇచ్చిన పని చేస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.

Praveen, Regional Coordinator -Ananthapuram

Praveen, Regional Coordinator -Ananthapuram

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, అనంతపురం సహా ప్రాంతీయ రాజకీయ, సామాజిక పరిణామాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.