Banaganapalle: ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

Banaganapalle: బనగానపల్లె ప్రజా దర్బార్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 13 Oct 2026 4:52 PM IST
Banaganapalle
X

Banaganapalle: ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

బనగానపల్లె: బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన వినతులు, అర్జీలను స్వీకరించారు.

ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించిన ఆయన సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

అలాగే, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల వినతులపై నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా స్పందించాలని పేర్కొన్నారు.

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టడం లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle