Markapuram: మార్కాపురంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన
Markapuram: మార్కాపురం 10వ వార్డు మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం, కెరీర్‌పై కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లావణ్య అవగాహన కల్పించారు.
Markapuram: మార్కాపురంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని 10వ వార్డు మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ కౌన్సిలర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లావణ్య విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు చదువుతో పాటు విలువలు, నైపుణ్యాలు, మంచి మర్యాదలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ వయసులో చోటుచేసుకునే హార్మోన్ల మార్పులు, వాటి ప్రభావాలను వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అల్లరి పనులను పక్కనపెట్టి విద్యపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
డ్రాయింగ్, కథలు రాయడం, పాటలు పాడటం, ఆటల్లో నైపుణ్యం సాధించడం వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో విద్యార్థులు నిత్యం పాల్గొనాలని ఆమె సూచించారు.
విద్యార్థులకు కౌన్సిలింగ్ ఎంతో అవసరమని పాఠశాల హెచ్‌ఎం రమేష్ తెలిపారు. కౌన్సిలర్లను నియమించిన ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతున్న లావణ్యకు పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




