Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. రద్దీ దృష్ట్యా భక్తులకు క్యూలైన్లలో అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 2 Nov 2026 10:55 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Srisailam: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ తెలుగు రాష్ట్రాల కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర భారీ సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

రద్దీతో ఆలయ ఉచిత క్యూ లైన్లు,150 శీఘ్రదర్శనం,300 అతి శీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి సోమవారం కావడంతో క్షేత్రానికి భారీగా తరలి వచ్చిన భక్తులు, భక్తులందరికీ శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనాలకు అనుమతి ఆన్లైన్ మనమిత్ర వార్త ద్వారా బుక్ ఓకే వచ్చే భక్తులకు రాత్రి 8.30 స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం అధికారులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందించేలా ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివాసరావు భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగతిన అవుతున్నాయని తెలిపారు భక్తుల రద్దీతో సందడిగా మారిన శ్రీశైలం మహా క్షేత్రం.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM