Giddalur: మార్కాపురం జిల్లాలో పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు

Giddalur: గత సంఘటనల దృష్ట్యా మార్కాపురం జిల్లాలో నవంబర్ 1న జరిగే మున్సిపల్ పోలింగ్‌కు వెబ్ కాస్టింగ్, పటిష్ట బందోబస్తు సిద్ధం చేశామని కలెక్టర్ విజయ సునీత తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 30 Oct 2026 10:47 PM IST
Giddalur
X

Giddalur: మార్కాపురం జిల్లాలో పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు

Giddalur: గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. గిద్దలూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, కలెక్టర్ విజయ సునీత సందర్శించారు.

రేపు సాయంత్రం కల్లా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. నవంబర్ 1న జరిగే పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పరిశీలించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులకు అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.

గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాలలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రెగ్గింగ్ జరిగే అవకాశం లేకుండా. సీసీ కెమెరాల పర్యవేక్షణ వెబ్ కాస్టింగ్ అదనపు పోలీసు భద్రతతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ విజయ సునీత అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటుని వినియోగించుకోవాలని ఓటర్లకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU