Markapuram: నల్లమల అటవీ ప్రాంతంలో లోయలోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం!

Markapuram: నల్లమల అటవీ ప్రాంతంలో ఎదురువచ్చిన వాహనాన్ని తప్పించబోయి అరటికాయల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి.

Srikanth Singam, Markapur
Published on: 20 Sept 2026 9:14 AM IST
Markapuram
X

Markapuram: నల్లమల అటవీ ప్రాంతంలో లోయలోకి దూసుకెళ్లిన బొలెరో వాహనం!

Markapuram: పెద్ద దోర్నాల మండలం చింతల గ్రామం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి అరటికాయల లోడుతో శ్రీశైలం వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారుఈ ఘటనలో ఎస్. ఫణికుమార్‌కు గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ద దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నల్లమల ఘాట్‌ రహదారిలో ప్రమాదకర మలుపులు, లోయలు, ఉండటంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు పరిపాటిగా జరుగుతూ ఉన్నాయి, సంబంధిత అధికారులు రోడ్లపై తగు సూచికలు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు,

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur