Markapur: ఒకనాడు మినీ అసెంబ్లీ.. నేడు శిథిల గూడు!
Markapur: ఒకప్పుడు మినీ అసెంబ్లీని తలపించిన మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరింది. మరమ్మతులకు రూ.40 లక్షలు ఖర్చవుతుందని అంచనా.
Markapur: ఒకనాడు మినీ అసెంబ్లీ.. నేడు శిథిల గూడు!
మార్కాపురం జిల్లా: ఒకప్పుడు ఆధునిక హంగులతో మినీ అసెంబ్లీని తలపించిన మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నేడు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకుంది. 2016లో సుమారు అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దిన సభా మందిరం ప్రస్తుతం పగిలిన కుర్చీలు, పనిచేయని పరికరాలు, దెబ్బతిన్న సీలింగ్‌లతో అధ్వానంగా మారింది.
గత పాలకుల నిర్లక్ష్యమా? అధికారుల ఉదాసీనతా? అన్న ప్రశ్నలు పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. హాల్‌ను తిరిగి ఆధునీకరించాలంటే సుమారు రూ.30 నుంచి 40 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.
ఏళ్ల తరబడి నిర్వహణ చేపట్టకపోవడంతో ఇప్పుడు మళ్లీ ప్రజాధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గమైనా మున్సిపల్ కౌన్సిల్ హాల్‌ను పునరుద్ధరించి, మున్సిపల్ ఆస్తుల పరిరక్షణకు శాశ్వత చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు? మినీ అసెంబ్లీకి మళ్లీ మహర్దశ ఎప్పుడు?




