Markapur: మానవత్వం చాటుకున్న సీఐ అల్తాఫ్ హుస్సేన్.. వీల్‌చైర్‌లో తీసుకెళ్లి..!

Markapur: మార్కాపురంలో మున్సిపల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన దివ్యాంగుడిని సీఐ అల్తాఫ్ హుస్సేన్ స్వయంగా వీల్‌చైర్‌లో తీసుకెళ్లి ఓటు వేయించి మానవత్వాన్ని చాటుకున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Nov 2026 10:48 AM IST
Markapur
X

Markapur: మానవత్వం చాటుకున్న సీఐ అల్తాఫ్ హుస్సేన్.. వీల్‌చైర్‌లో తీసుకెళ్లి..!

Markapur: ఎన్నికల విధుల్లో కఠిన బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రజలకు అండగా నిలుస్తూ మార్కాపురం పట్టణ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపారు.

ఈ క్రమంలో ఓ వికలాంగుడు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావడంతో సీఐ అల్తాఫ్ హుస్సేన్ స్వయంగా స్పందించారు. వీల్‌చైర్‌లో ఆయనను దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు అని చేతల్లో చూపించిన పోలీసుల సేవాభావం పలువురి ప్రశంసలు అందుకుంది. విధి నిర్వహణలోనే కాదు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలోనూ తాము ముందుంటామని మార్కాపురం పోలీసులు చాటిచెప్పారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM