Markapur: మార్కాపురం చెన్నకేశవ స్వామి హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు!
Markapur: మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు వచ్చినట్లు ఈవో గొలమారి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Markapur: మార్కాపురం చెన్నకేశవ స్వామి హుండీ ఆదాయం రూ.15.13 లక్షలు!
Markapur: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి గొలమారి శ్రీనివాసులు రెడ్డి, దేవాలయ ఇన్‌స్పెక్టర్ ఆర్.కె. చైతన్య పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
గత 5 నెలల 19 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా మొత్తం రూ.15,13,625 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో 4 నెలల 15 రోజుల కాలానికి నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.12,45,666 ఆదాయం సమకూరింది. దీంతో గత లెక్కింపుతో పోలిస్తే ప్రస్తుత హుండీ ఆదాయం రూ.2,67,959 పెరిగింది.
ఈ సందర్భంగా ఈవో గొలమారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, భక్తుల విశ్వాసం, సహకారంతో దేవస్థాన హుండీ ఆదాయం పెరిగిందని తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో రాజ్యలక్ష్మి సేవా సంఘం మహిళలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.




