Nandikotkur: సైకిల్ గుర్తుపై ఓటు వేసి నందికొట్కూరు అభివృద్ధికి బాటలు వేయండి!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ 28వ వార్డు కూటమి అభ్యర్థి శీలం రాధమ్మకు మద్దతుగా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రచారం.
Nandikotkur: సైకిల్ గుర్తుపై ఓటు వేసి నందికొట్కూరు అభివృద్ధికి బాటలు వేయండి!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ 28వ వార్డు అభ్యర్థి శీలం రాధమ్మకు మద్దతుగా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రచారం లో దూసుకెళుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనే మాట వినిపించకుండా పోయింది.
నియోజకవర్గంలో రోడ్లన్నీ గోతులమయమై, అడుగు తీసి అడుగు వేయడానికే భయపడేలా శిథిలమైపోయాయి. చిన్నపాటి వర్షానికే మురుగు కాల్వలు పొంగిపొర్లుతూ పారిశుద్ధ్యం పడకేసింది. సంక్షేమం పేరిట కేవలం బటన్ నొక్కి మభ్యపెట్టారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే అభివృద్ధిలో నియోజకవర్గాన్ని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు.
రెండేళ్లలోనే ఛిద్రమైన రోడ్లపై గుంతలను పూడ్చడమేగాక డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాం, ప్రధాన రహదారికి నిధులు విడుదల చేసి, పనులను పరుగులు తీయించాం. అందుకే నాటి విధ్వంసాన్ని నేటి అభివృద్ధిని పరిశీలించుకోండి. ప్రగతికి ఓటు వేసి ఆశీర్వదించండి.
మీ ఓటుతోనే నందికొట్కురుకు మరింత మంచి రోజులు వస్తాయి’ అని , 28వ వార్డు అభ్యర్థి శీలం రాధమ్మ, ప్రతి ఇంటికి వెళ్లి కూటమి పాలనలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరించారు. వైసీపీ కారణంగా ప్రజలు ఎంత నష్టపోయారనేది తెలియజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి బాటలు వేయచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా తమకు అండగా నిలిచే కూటమి నాయకులను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన సాధ్యమని, ఓటర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో 28వ వార్డు అభ్యర్థి శీలం రాధమ్మ కు ఆమె భర్త శీలం గోవర్ధన గిరి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రచార కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నడిపిస్తుండటం హర్షించదగ్గ విషయం.శీలం గోవర్ధన గిరి స్వతహాగా వ్యాపారస్తుడు అయినప్పటికీ ప్రజా శ్రేయస్సును కోరి టీడీపీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడం ఈ వార్డులో వీరికి కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.




