Gudur: గూడూరులో వైసీపీకి షాక్: జనసేనలోకి భారీగా చేరికలు
Gudur: కర్నూలు జిల్లా గూడూరులో మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. కౌన్సిలర్ బజారితో పాటు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి.
Gudur: గూడూరులో వైసీపీకి షాక్: జనసేనలోకి భారీగా చేరికలు
కర్నూలు: గూడూరు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, జిల్లా దళిత నాయకుడు సుభాకర్, 15వ వార్డు కౌన్సిలర్ బజారి, నాయకులు దేవదాసు, జాన్, బెళగల్ నాగేష్, మారెప్ప, కొత్తకోట జాన్ తదితరులతో పాటు సుమారు 100 కుటుంబాలు జనసేనలో చేరిక.
ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ నేతృత్వంలో నియోజకవర్గ నాయకుడు సంధ్యా విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని సాయి వసంత్ కాంప్లెక్స్ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం వారికి చింత సురేష్ బాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సుభాకర్ మాట్లాడుతూ.. వైసీపీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో పార్టీ కోసం పనిచేసినప్పటికీ తనకు తగిన గుర్తింపు లభించలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.
సంధ్యా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు. చింతా సురేష్ మాట్లాడుతూ గూడూరు, కోడుమూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి కోర్పొరేషన్ డైరెక్టర్ తొళ్ల మంజునాథ్ గారు జనసేన ఐటీ కోఆర్డినేటర్ తిరుమల్, నాయుడు, గూడూరు జనసేన నాయకులు టి.ఎస్. అశోక్, మహానంది రెడ్డి, కుమార్, మనోహర్, లక్ష్మన్న తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.




