Markapuram: మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం. శ్రీదేవి నియామకం!
Markapuram: మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (DRO) ఎం. శ్రీదేవి నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్.
Markapuram: మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం. శ్రీదేవి నియామకం!
మార్కాపురం: జిల్లా రెవెన్యూ అధికారిగా ఎం. శ్రీదేవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఆమెను మార్కాపురం జిల్లాకు బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చింది.
తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్త బాధ్యతల్లో చేరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్‌గా పనిచేసిన అనుభవం శ్రీదేవికి ఉంది. ఆమె రిలీవింగ్, జాయినింగ్ తేదీలను ప్రభుత్వానికి తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.




