Markapur: మార్కాపురం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం!

Markapur: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అటవీ అధికారులు పాదముద్రలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Srikanth Singam, Markapur
Published on: 6 Oct 2026 3:58 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం!

Markapur: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో లింగయ్య డొంక వద్ద పొలాల్లో ఉన్న రైతులకు చిరుతపులి కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు.

చిరుతను చూసిన రైతులు కేకలు వేయడంతో అది అక్కడి నుంచి గ్రామం చివరి వీధి వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. గ్రామానికి సమీపంలో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంతాలను పరిశీలించి చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, ముఖ్యంగా పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుత సంచారం కనిపించినా దాని వెంట వెళ్లడం, దగ్గరకు వెళ్లి ఫొటోలు లేదా వీడియోలు తీయడం చేయవద్దని సూచించారు. చిరుత కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

గ్రామస్థులు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ సిబ్బంది సూచనలు పాటించాలని అధికారులు కోరారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur