Kurnool: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి!

Kurnool: పెంచికలపాడు జడ్పీ హైస్కూల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు జరిగింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Nov 2026 10:59 AM IST
Kurnool
X

Kurnool: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి!

Kurnool: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి.లీలా వెంకట శేషాద్రి గారి సూచనల మేరకు పెంచికలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం బాల్య వివాహాల నిర్మూలన, మాదకద్రవ్యాల వినియోగం మరియు దుర్వినియోగం వంటి సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రారావు మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు బాలల హక్కులు, వారి రక్షణ, సామాజిక బాధ్యతల గురించి వివరించారు.

పోక్సో చట్టంపై మాట్లాడుతూ, బాలలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు మరియు ఇతర అనుచిత చర్యల నుంచి పిల్లలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి ఈ చట్టం రూపొందించబడిందని వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ లీగల్ సర్వీస్ యూనిట్ మెంబెర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, తమ హక్కులను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతాయని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వివరించారు. ప్రతి బాలికకు విద్యనభ్యసించే హక్కు ఉందని, 18 సంవత్సరాల లోపు బాలికలకు వివాహం చేయకూడదని, బాలురకు 21 సంవత్సరాలు నిండకముందు వివాహం చేయడం చట్టవిరుద్ధమని తెలియజేశారు. అదేవిధంగా మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాయిలీల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL