Kurnool: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో వాల్మీకి చూడి ఉల్లిగయ్య పేరు!
Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం జెడ్పీ చైర్మన్ రేసులో కౌతాళం జడ్పీటీసీ వాల్మీకి చూడి ఉల్లిగయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత నేపథ్యం.
Kurnool: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో వాల్మీకి చూడి ఉల్లిగయ్య పేరు!
Kurnool: కర్నూలు జిల్లా మంత్రాలయం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కౌ తాళం జడ్పీటీసీ సభ్యుడు విజయం సాధించిన వాల్మీకి చూడి ఉల్లిగయ్య పేరు చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. 1983 నుంచి ఓకే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ,సీనియర్, జిల్లా నాయకుడు కావడంతో పాటు జిల్లా లో బి సి వాల్మీకి వర్గంనాకి చెందిన అయ్యనకు అదనపు బలంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ సీనియర్ నాయకుడు వాల్మీకి బి సి సమాజవర్గం చూడి ఉల్లిగయ్య కు పార్టీ సీనియర్ నేతలు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తో పాటు ఎమ్మిగనూరు బి ,వి, జయ నాగేశ్వర్ రెడ్డి , జిల్లా కే డి సి సి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మంత్రాలయం తెదేపా ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో తానుకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కేలా చూడి ఉల్లిగయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు, వాల్మీకి బి సి వరం కోటాలో వాల్మీకి చూడి ఉల్లిగయ్య కు అవకాశం కల్పిస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్లవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అత్యంత వెనుకబడిన మంత్రాలయం నియోజకవర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కితే ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతమైన,మంత్రాలయం ఆదోని ఎమ్మిగనూరు ఆలూరు పత్తికొండ కోడుమూరు చేస్తానంటున్న జడ్పిటిసి చూడు ఉలగయ్య.
కర్నూలు జిల్లా సీనియర్ నాయకులో ఒకరు వాల్మీకి ఫెడరేషన్ డైరెక్షన్ నెంబర్ గా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా కు సేవలు అందించారు 1983 నుంచి ఒక్కసారి కూడా పార్టీని మారలేదు ఇలాంటి సీనియర్ నాయకులకు, రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని టీడీపీ అధిష్ఠానం చెబుతున్న నేపథ్యంలో ఆ మాటలను ఆచరణలో చూపించి వాల్మీకి చూడి ఉల్లిగయ్య చైర్మన్ పదవి కేటాయించాలని పలువురు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గానికి దక్కని జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, గోతులదొడ్డి గ్రామానికి చెందిన చూడి ఉల్లిగయ్య దక్కితే అది రాజకీయంగా చారిత్రాత్మక పరిణామం అవుతుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా దౌర్జన్యాలకు తావు లేకుండా గుర్తింపు పొందిన ప్రాంతం నేడ నాడు ఒకే పరిస్తితులతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో జిల్లా పరిషత్ పీఠం ఈ ప్రాంతానికి దక్కితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరి టీడీపీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది? బి సి వర్గం వాల్మీకి చూడి ఉల్లిగయ్య కలిసొస్తుంద మంత్రాలయంనియోజకవర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కుతుందా? అన్నది వేచి చూడాలి.




