Aspari: ఆస్పరి ఎంపీటీసీ నామినేషన్ల వద్ద ఉద్రిక్తత.. టీడీపీ వాగ్వాదం!
Aspari: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల వద్ద ఉద్రిక్తత. వైఎస్సార్సీపీ అభ్యర్థుల వివరాలు ఇవ్వలేదని ఆర్ఓతో టీడీపీ నేతల వాగ్వాదం.
Aspari: ఆస్పరి ఎంపీటీసీ నామినేషన్ల వద్ద ఉద్రిక్తత.. టీడీపీ వాగ్వాదం!
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ఎన్నికల కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల గ్రామాల వారీ వివరాలను తమకు ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు. అయితే ఎన్నికల అధికారులు ఆ వివరాలు ఇవ్వకపోవడంతో రిటర్నింగ్ ఆఫీసర్పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా టీడీపీ నాయకులు ఆర్వోతో వాదించరు ఈ ఘటనతో ఎన్నికల కేంద్రంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అధికారుల విధులకు ఆటంకం కలిగిందని ఎన్నికల సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఆర్డీఓ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పోలీసులు టీడీపీ నాయకులను ఎంపీడీఓ కార్యాలయం బయటికి పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.




