Kodumuru: కోడుమూరులో విషాదం అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
Kodumuru: కర్నూలు జిల్లా అనుగొండలో అప్పుల బాధతో కౌలు రైతు సింగరాణి శివశంకర్ ఆత్మహత్య. రూ. 7.50 లక్షల అప్పుతో మనస్తాపం చెంది సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి.
Kodumuru: కోడుమూరులో విషాదం అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామానికి చెందిన సింగరాణి శివశంకర్ (36), తండ్రి వెంకట రాముడు అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఒక ఎకరా పొలంతో పాటు మరో ఏడు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని గత నాలుగేళ్లుగా పత్తి, పొగాకు పంటలు సాగు చేస్తున్నాడు.
అయితే పంటలు సరిగా పండకపోవడంతో సుమారు 7.50 లక్షల అప్పు అయింది. ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శివశంకర్ నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బోయ జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




