Kurnool: మూడు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
Kurnool: ఆస్పరి మండలంలో ఆపదలో ఉన్న మూడు కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.
Kurnool: మూడు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
కర్నూలు: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఆపదలో ఉన్న మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందింది. ఆస్పరి మండలానికి చెందిన దేవరైంటి తరుణ్ తేజ్ కుటుంబానికి రూ.52,114, మరో కుటుంబానికి చెందిన రామలక్ష్మి కుటుంబానికి రూ.1,10,343, అలాగే చిన్నహోతూరు గ్రామానికి చెందిన మల్లేశ్వరి కుటుంబానికి రూ.1 లక్ష... ముఖ్యమంత్రి సహాయ నిధి, CMRF ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు
మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని... అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి తెలిపారు.
ప్రభుత్వ సహాయాన్ని కేవలం ప్రకటించడమే కాకుండా... లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజేస్తున్న వైకుంఠం జ్యోతి చొరవపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగ ఉంటుంది అన్ని ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు.




