Halaharvi: రూ.1.02 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత: ఆలూరులో టీడీపీ భరోసా!

Halaharvi: కర్నూలు జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న మోకా మైలారప్పకు రూ. 1,02,416 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి అందజేశారు.

Bheemalinga, Aluru
Updated on: 8 Oct 2026 10:57 PM IST
Halaharvi
X

Halaharvi: రూ.1.02 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత: ఆలూరులో టీడీపీ భరోసా!

హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్యం గ్రామానికి చెందిన మోకా మైలారప్ప కాలు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ చికిత్స పొందారు. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి... CMRFకు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తు చేసిన కేవలం రెండు నెలల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ద్వారా రూ.1,02,416 విలువైన CMRF చెక్కు మంజూరైంది.

మంజూరైన చెక్కును ఆలూరు టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి స్వయంగా గుళ్యం గ్రామంలోని మోకా మైలారప్ప ఇంటికి వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ... ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరువ చేస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటామని తెలిపారు .

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru