Kurnool: ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం

Kurnool: కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ హర్షం. విజేతలకు శుభాకాంక్షలు, ప్రజలకు ధన్యవాదాలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Nov 2026 7:40 PM IST
Kurnool
X

Kurnool: ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం

కర్నూలు: కర్నూలు జిల్లాలో నిన్న వెలువడిన కార్పొరేషన్, మున్సిపాలిటీ మరియు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని ఆమె పేర్కొన్నారు.

కర్నూలు మినిస్టర్ టీజీ భరత్, పార్లమెంట్ సభ్యుడు నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితా రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే శ్రీ బి.జయనాగేశ్వర్ రెడ్డి మరియు ఆదోని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ బి.వి.మీనాక్షి నాయుడు సంపూర్ణ సహకారం, నాయకత్వంతోనే కర్నూలు కార్పొరేషన్, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ, కోడుమూరు నగర పంచాయతీ పరిధిలో తోపాటు ఆదోనిలో కూడా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించడం సాధ్యమైందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన కర్నూలు కార్పొరేషన్‌లో మన అభ్యర్థులు ఘన విజయం సాధించి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం ఎంతో సంతోషకరమని, కర్నూలు నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాబోయే రోజుల్లో పాలన సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని గూడూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారని, ఎమ్మిగనూరు లో కూడా స్థానిక ప్రజలు మన పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టి విజయాన్ని కట్టబెట్టారని హర్షం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ఆదోని మున్సిపాలిటీ పరిధిలో విజయం సాధించిన జనసేన పార్టీ రెబల్ అభ్యర్థి, శ్రీ మల్లప్ప సతీమణికి స్వప్న కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని ప్రకటించారు.

ఈ విజయం కేవలం నాయకులది మాత్రమే కాదని, రాత్రింబవళ్లు శ్రమించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు కూటమి శ్రేణుల కష్టానికి దక్కిన ప్రతిఫలమని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కొనియాడారు. మనపై నమ్మకంతో ఈ ఘన విజయాన్ని అందించిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచిన స్థానాల్లో ప్రజా సంక్షేమం మరియు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL