Kurnool: కోడుమూరు, నాగలాపురం పోలీస్ స్టేషన్లలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు, నాగలాపురం పీఎస్‌లను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల భద్రత, నేరాల నివారణపై ఆదేశాలు జారీ చేశారు.
Kurnool: కోడుమూరు, నాగలాపురం పోలీస్ స్టేషన్లలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం కోడుమూరు, నాగలాపురం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు అధికారులు చేపడుతున్న చర్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్‌తో పాటు కోడుమూరు సీఐ తబ్రేజ్, కోడుమూరు ఎస్సై డి.వై. స్వామి, నాగలాపురం ఎస్సై అఖిల్ పాల్గొన్నారు.




