Kurnool: దేవరగట్టు ఉత్సవాల నేపథ్యంలో రింగు కర్రల స్వాధీనం ఇద్దరి అరెస్ట్
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు దేవరగట్టు ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహించి, ఇద్దరిని అదుపులోకి తీసుకుని రింగు కర్రలు స్వాధీనం చేసుకున్నారు.
Kurnool: దేవరగట్టు ఉత్సవాల నేపథ్యంలో రింగు కర్రల స్వాధీనం ఇద్దరి అరెస్ట్
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు దేవరగట్టు మాలమలేశ్వర స్వామి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో2026 భాగంగా బుధవారం రాత్రి ఆలూరు ఇన్‌చార్జి ఎస్‌ఐ దిలీప్‌కుమార్, హాలహర్వి ఎస్‌ఐ ఈశ్వర్‌రావు ఆధ్వర్యంలో గ్రామాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా అరికెర గ్రామానికి చెందిన కృష్ణ, విరూపాపురం గ్రామానికి చెందిన బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రింగు కర్రలను ,తయారు చేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దేవరగట్టు ఉత్సవాల్లో ప్రమాదకర ఆయుధాలను వినియోగించడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.




