Kurnool: రూ.3.5 లక్షల విలువైన సెంట్రింగ్ షీట్ల దొంగల ముఠా అరెస్ట్!
Kurnool: కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో రూ.3.5 లక్షల విలువైన 320 సెంట్రింగ్ షీట్లు దొంగిలించిన ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తు, ఆటోలను సీజ్ చేశారు.
Kurnool: రూ.3.5 లక్షల విలువైన సెంట్రింగ్ షీట్ల దొంగల ముఠా అరెస్ట్!
కర్నూలు: కర్నూలు నగరంలో ని వీకర్ సెక్షన్ కాలనీ లో బిల్డర్ మోహన్ నిర్మిస్తున్న ఇంటిలో స్లాబ్ పనుల కోసం పెట్టి ఉంచిన సెంట్రింగ్ షీట్స్ సుమారు 320 వరకు గుర్తు తెలియని వ్యక్తులు గత వారం దొంగతనం చేశారు అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు పరచి, ధర్యాప్తులో భాగంగా నేర స్థలం నుండి అందుబాటులోని CCTV ఫుటేజ్ లను పరిశీలించగా ముగ్గురు యువకులు ఒక ఎలక్ట్రిక్ auto లో వాటిని తరలిస్తున్నట్టు గమనించి, ట్రాక్ చేస్తూ విచారణ లో మహమ్మద్ తండ్రి పేరు రజాక్ ఖాన్ వయస్సు 21 ఎన్టీఆర్ బిల్లింగ్,
కాజా తండ్రి పేరు మక్బుల్ భాష వయసు 28 సంతోష్ నగర్, రఫీ తండ్రి పేరు చాంద్ భాషా వయస్సు 27 ఎన్టీఆర్ బిల్లింగ్, పఠాన్ రిహాన్ అలీ ఖాన్ తండ్రి పేరు పఠాన్ ప్రజా ఖాన్ వయసు 19, ఎన్టీఆర్ బిల్డింగ్, షేక్ షాహిద్ తండ్రి పేరు షేక్ హసన్ భాష వయసు 20 ఎన్టీఆర్ బిల్డింగ్ అను 5 మంది తమ జల్సాలకు గాను సదరు సెంట్రింగ్ షీట్లను దొంగతనం చేసి.
కోడుమూరు రోడ్ నందు గల గుజిరి షాపుల నందు విక్రయించునట్టు అంగీకరించడం తో సదరు నిందితులను అరెస్ట్ చేసి, సదరు దొంగతనం చేయబడ్డ మొత్తం సెంట్రింగ్ షీట్ లను మరియు దొంగతనానికి ఉపయోగించిన ఆటో లను సీజీ చేయడం జరిగింది. సదరు నిందితులు అందరి మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వీరి కదలికలపై నిఘా ఉంచడం జరుగుతుంది.




