Pattikonda: సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తా: కట్టా వేణుగోపాల్!

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దేవనకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కట్టా వేణుగోపాల్ రావు సోమవారం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

G Jagadeesh, Pathikonda
Published on: 16 Nov 2026 5:25 PM IST
Pattikonda
X

Pattikonda: సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తా: కట్టా వేణుగోపాల్!

పత్తికొండ: దేవనకొండ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దేవనకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కట్టా వేణుగోపాల్ రావు సోమవారం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గ్రామంలోని వివిధ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్టాండ్ నుంచి నామినేషన్ కేంద్రం వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

నామినేషన్‌కు ముందు కట్టా వేణుగోపాల్ రావు తన సోదరుడు శివరావుతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని, సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు.

గ్రామంలోని పేద కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ఆపదలో ఉన్న నిరుపేదలకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. దేవాలయాల అభివృద్ధి, విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహం, యువతకు సహకారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda