Kurnool: యన్.కొంతలపాడులో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన 25 కుటుంబాలు!

Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం యన్.కొంతలపాడు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడు మాధవస్వామి ఆధ్వర్యంలో 25 కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో టీడీపీలో చేరాయి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 16 Nov 2026 1:52 PM IST
Kurnool
X

Kurnool: యన్.కొంతలపాడులో వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన 25 కుటుంబాలు!

కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం యన్ కొంతలపాడు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మాధవ స్వామి తో 25 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో తెలుగుదేశం పార్టీ లో చేరారు వీరందరికి గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ లో చేరిన వారు వజ్రగిరి పగిడాల రాజు,గోరంట్ల చిన్న,వెంకటేశ్వర్లు,బక్కన్న రవీంద్ర,,చింతలన్న,డీలర్ కృష్ణ మంద లింగన్న,ఏసు రత్నం,పెద్ద మాదన్న, చిన్న స్వాములు,చంటి చేరారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి,గ్రామ నాయకులు శ్రీనివాసులు,వెంకటేశ్వర్లు, హరి,చంద్రశేఖరప్ప,విజయుడు,రసూల్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL