Kurnool: వైసీపీని వీడి టీడీపీలో చేరిన బ్రాహ్మణపల్లె ముఖ్య నేతలు!
Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Kurnool: వైసీపీని వీడి టీడీపీలో చేరిన బ్రాహ్మణపల్లె ముఖ్య నేతలు!
కర్నూలు: ఓర్వకల్లు మండలం బ్రాహ్మణ పల్లె గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు రాజగోపాల్ రెడ్డి, దేవరాజు,కురువ వెంకటేశ్వర్లు,రవి,చందు, భూషణ్ణ, అవుకు సుబ్బారాయుడు,రవీంద్ర, ముఖ్యమైన కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి గారు, నందికొట్కూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు వెంకట రెడ్డి గారి సమక్షంలో మాధవి నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి.వీరందరికీ గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి,సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ చౌదరి,మాజీ డైరెక్టర్ రామ పుల్లారెడ్డి, గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.




