Kurnool: పోలింగ్ కేంద్రాల మార్పులపై పార్టీల సూచనలు: ఓబులేసు

Kurnool: కర్నూలు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ చల్లా ఓబులేసు సమీక్షా సమావేశం నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 26 Sept 2026 4:23 PM IST
Kurnool
X

Kurnool: పోలింగ్ కేంద్రాల మార్పులపై పార్టీల సూచనలు: ఓబులేసు

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల ప్రతిపాదిత ముసాయిదాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని, వాస్తవ పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది జాబితాను ప్రచురిస్తామని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల ప్రతిపాదిత ముసాయిదాను రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించిన అనంతరం అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది జాబితాను ప్రచురిస్తామని కమిషనర్ తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, డిసిపి శబ్నం శాస్ర్తీ, ఏసిపి నాగరాజు, మేనేజర్ జునైద్, సూపరింటెండెంట్ సుబ్బన్న, సి1 రామకృష్ణ, సి3 శ్రీకాంత్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, ఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL