Kurnool: కర్నూలు 34వ వార్డు బీజేపీ అభ్యర్థి రామకృష్ణకు బలిజ సంఘం మద్దతు
Kurnool: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ 34వ వార్డు కూటమి బీజేపీ అభ్యర్థి చింతలపల్లి రామకృష్ణకు నగర బలిజ సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Kurnool: కర్నూలు 34వ వార్డు బీజేపీ అభ్యర్థి రామకృష్ణకు బలిజ సంఘం మద్దతు
కర్నూలు: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ వార్డు (కృష్ణా నగర్) నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీ చింతలపల్లి రామకృష్ణ గారికి కర్నూలు నగర బలిజ సంఘం నాయకులు అభినందనలు తెలియజేసి, తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
శనివారం ఉదయం కర్నూలు నగరంలోని కృష్ణా నగర్లో ఉన్న శ్రీ చింతలపల్లి రామకృష్ణ గారి స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో బలిజ సంఘం ప్రముఖులు పాల్గొని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయనకు తమ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చింతలపల్లి రామకృష్ణ మృదుస్వభావి, స్నేహశీలి, విద్యావేత్తగా, సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా సమాజంలో మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బలిజ సంఘీయుల అభివృద్ధి, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో విశేషంగా కృషి చేయడంతో పాటు, బలిజ ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడిన వ్యక్తిగా రామకృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.
సమాజంలోని వివిధ వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఉండి, ప్రజల సమస్యల పట్ల అవగాహనతో వ్యవహరించే ఆయనకు ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తే వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చింతలపల్లి రామకృష్ణకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ, ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు.
ఈ సమావేశంలో కర్నూలు నగర బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి మండ్లెం రవి కుమార్, కోశాధికారి, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్, బలిజ సంఘం నాయకులు, రిటైర్డ్ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కామిని వెంకటేశ్వర్లు, పోస్టల్ యూనియన్ నాయకులు వై. మధుసూధన రావు, బిల్డర్ సురేష్, కర్నూలు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి, విజ్ఞాన ఇంగ్లిష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గౌతమ్ కృష్ణ, రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రోపా జనరల్ సెక్రటరీ, అడ్వకేట్ కోనేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




